News April 28, 2024
చంద్రబాబుకు తలలో చిప్ లేదు: సజ్జల

AP: టీడీపీ అధినేత చంద్రబాబుకు తలలో చిప్ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 2014-19 మధ్యలో బాబు విశ్వరూపాన్ని ప్రజలు చూశారు. మేనిఫెస్టో అంటే ఓ బాండ్ లాంటిది. కానీ దానిని చంద్రబాబు చిత్తుకాగితంతో సమానంగా చూస్తున్నారు. మేం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చూస్తున్నాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
VKB: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించండి: కలెక్టర్

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున నీటిని పొదుపుగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎండల దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 16, 2026
వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.
News April 16, 2026
మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.


