News August 1, 2024
SC వర్గీకరణకు నాంది పలికిన చంద్రబాబు

SCల్లో రిజర్వేషన్లు అందని వర్గాలను గుర్తించాలని 1996లో ఉమ్మడి AP CM చంద్రబాబు ఓ కమిషన్ ఏర్పాటు చేశారు. వెనుకబాటు ప్రాతిపదికన SCలను 4 వర్గాలుగా విభజించి 15% రిజర్వేషన్లలో గ్రూప్-Aకు 1%, Bకి 7%, Cకి 6%, Dకి 1%గా నిర్ణయించారు. AP షెడ్యూల్ క్యాస్ట్ యాక్ట్ రూపొందించారు. దీన్ని సవాల్ చేస్తూ HC, ఆ తర్వాత సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. HC పిటిషన్లు కొట్టేయగా, SCలను వర్గీకరించకూడదని సుప్రీం చెప్పింది.
Similar News
News January 19, 2026
ట్రంప్‌కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.
News January 19, 2026
అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.
News January 19, 2026
ఐఐటీ ఢిల్లీలో పోస్టులు

<


