News March 20, 2025
చంద్రబాబు SC వర్గీకరణ రూపకర్త: పవన్ కళ్యాణ్

AP: SC వర్గీకరణకు CM చంద్రబాబు ఆద్యుడు, రూపకర్త అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు నాంది పలికిన చంద్రబాబుకు ధన్యవాదాలని అసెంబ్లీలో చెప్పారు. ‘ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది. వర్గీకరణ బిల్లుకు మనస్ఫూర్తిగా ఆమోదం పలుకుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు, మందకృష్ణే కారణం. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 31, 2026
కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- జాగ్రత్తలు

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.
News January 31, 2026
IOCLలో 405 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 31, 2026
నేడు ఈ పనులు చేయకండి: పండితులు

శని దోష నివారణకు నేడు అనుకూలమైన రోజు. అందుకే నేడు ఎవరినీ నిందించకూడదు. అస్సలు అవమానించకూడదు. ముఖ్యంగా పనివారు, వృద్ధులు, పేదలను వేధించకూడదు. అలాగే ఇనుప వస్తువులు కొనడం నిషేధం. నల్ల నువ్వులు, నూనె వంటివి కూడా కొనుగోలు చేయకూడదట. ఆలయాలకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంటి గడపపై కూర్చోవడం లేదా గడపను తొక్కడం వంటివి కూడా చేయరాదట.


