News August 16, 2024

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు కూడా ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు. అనంతరం శనివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 18, 2024

మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు: అంబటి రాంబాబు

image

AP: రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే నోటికి తాళం వేస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు? అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటి వరకు మీ నోటికి తాళం వేసుకోండి’ అని ట్వీట్ చేశారు.

News September 18, 2024

నెల్లూరులో జానీ మాస్టర్!

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై నెల్లూరు పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదించారని సమాచారం. దీంతో జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది.

News September 18, 2024

రాహుల్‌పై వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ధర్నాలు చేపట్టడంతో పాటు బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ఆయన మధ్యాహ్నం పాల్గొంటారు.