News September 16, 2024

నేడు గుజరాత్‌కు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో పర్యటించనున్నారు.‘రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌-2024’లో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల గురించి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సదస్సును PM మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా PMతో CBN సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వరద నష్టాన్ని ఆయనకు వివరిస్తారని సమాచారం.

Similar News

News October 15, 2024

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు

image

AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.

News October 15, 2024

కెన‌డాతో ఇక క‌టిఫ్‌.. ఎన్నిక‌ల వ‌ర‌కు ఇంతేనా!

image

భార‌త్‌-కెన‌డా మ‌ధ్య వివాదాలు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా కనిపించ‌డం లేదు. ట్రూడో ప్రభుత్వ ఖలిస్తానీ వేర్పాటువాద అనుకూల విధానాలపై ఆగ్రహంగా ఉన్న భారత్ అక్కడి దౌత్య‌వేత్త‌ల‌ను వెన‌క్కి పిలిపించింది. అలాగే ఇక్క‌డి కెన‌డా దౌత్య‌వేత్త‌ల‌ను బ‌హిష్క‌రించింది. కెనడాలో వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కెనడా వైఖరి మారితేనే దౌత్య బంధాలపై స్పష్టతరానుంది.

News October 15, 2024

అక్టోబర్ 15: చరిత్రలో ఈ రోజు

image

1931: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జననం
1933: డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి జననం
1939: నటుడు జీ రామకృష్ణ జననం
1953: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జననం
1987: హీరో సాయి ధరమ్ తేజ్ జననం
1994: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ జననం
2022: సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం