News July 14, 2024

మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు భేటీ

image

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ముంబైలోని షిండే నివాసంలో వీరి సమావేశం జరిగింది. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

Similar News

News October 4, 2024

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు ₹500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.

News October 4, 2024

వరి పంట కొనుగోలు కేంద్రాలు సిద్ధం

image

TG: వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి సాగు ముందుగా పూర్తైన NZB, NLG జిల్లాల్లో తొలుత కేంద్రాలను ప్రారంభించనున్నారు. 88.09 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48.91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 4, 2024

తెలంగాణలో మరో 2 IIITలు?

image

TG: బాసరలోని RGUKTకి అనుబంధంగా మరో రెండు IIITలను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఒకటి ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేయొచ్చని సమాచారం. ఒక్కోదానికి 100 ఎకరాల భూమి, రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇంజినీరింగ్‌తోపాటు మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.