News February 19, 2025
నేడు ఢిల్లీకి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11.30కి జరిగే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఈ మేరకు ఎన్డీయే పెద్దలు ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం జరగనుంది. కాబోయే ముఖ్యమంత్రిని ఈ సమావేశంలో ఎంచుకోనున్నారు. ఎవరి పేరును ప్రకటిస్తారన్న ఆసక్తి బీజేపీ వర్గాల్లో నెలకొంది.
Similar News
News April 17, 2026
బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి?

నుదిటిపై కుంకుమను ధరించిన ప్రతీసారి ఉంగరపు వేలును ఉపయోగించడం మేలని, తద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే, ఈ వేలు సంపూర్ణ జల సూత్రాన్ని ఆకర్షిస్తుందట. తద్వారా బొట్టు పెట్టిన వారికి కూడా చాలా లాభాలుంటాయట. శరీరంలో శక్తి ప్రవాహాన్ని పెంచుకోవాలంటే ఈ నియమాన్ని పాటించాలని పండితులు చెబుతారు. ముఖ్యంగా స్త్రీలు కచ్చితంగా ఉంగరం వేలితోనే బొట్టు పెట్టుకోవాలట.
News April 17, 2026
దొరికిపోయిన ‘జననాయగన్’ లీక్ దొంగలు

విజయ్ సినిమా ‘జననాయగన్’ లీక్ కేసును పోలీసులు ఛేదించారు. ఓ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ సినిమా స్టూడియో సెక్యూరిటీని దాటుకొని మరీ డిజిటల్ రీల్స్‌ను దొంగిలించినట్లు గుర్తించారు. వేరే ప్రాజెక్టులో పని చేస్తూ ఎడిటింగ్ రూమ్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు.. డేటాను దొంగిలించి మరో ఇద్దరికి చేరవేశాడు. దీంతో సినిమా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 17, 2026
‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.


