News March 17, 2025

రేపు ఢిల్లీకి చంద్రబాబు

image

AP: అమరావతి పున: ప్రారంభ పనుల ఆరంభోత్సవానికి PM మోదీని ఆహ్వానించేందుకు CM చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీఎంతో ఆయన బుధవారం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు, అమరావతికి సాయం సహా వివిధ అంశాలపై ఆయన మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని సమాచారం.

Similar News

News April 24, 2025

9 ఏళ్ల తర్వాత వరుస హాఫ్ సెంచరీలు

image

ఈ ఐపీఎల్ తొలి నాలుగైదు మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్ శర్మ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ నెల 20న CSKపై 76*, నిన్న SRHపై 70 రన్స్ చేశారు. ఇలా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడం 9 ఏళ్లలో తొలిసారి. చివరిసారిగా 2016లో 62, 65, 68*, 85* రన్స్ చేశారు. అంతకుముందు 2008లో 76*, 57, 2010లో 51, 68*, 2011లో 87, 56*, 2013లో 74*, 62* బ్యాక్ టు బ్యాక్ అర్ధ శతకాలు బాదారు.

News April 24, 2025

టెన్త్ ఫెయిలైన వారికి ALERT

image

AP: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000గా ఉంది. https://www.bse.ap.gov.in/ సైట్‌లో HM లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.

News April 24, 2025

మాజీ మంత్రి విడదల రజినీ మరిది అరెస్ట్

image

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినీతో పాటు గోపీపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

error: Content is protected !!