News April 10, 2025

చంద్రబాబు గారూ.. రొయ్యల రేటు ఎందుకు పెరగడం లేదు?: జగన్

image

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశాలు ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలని YS జగన్ అన్నారు. ‘రొయ్యలకు వేసే మేతపై సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. సోయాబీన్‌ రేటు కిలోకు రూ.105 నుంచి రూ.25కి పడిపోయింది. ముడిసరకుల రేట్లు పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు ఎందుకు తగ్గడం లేదు? US టారిఫ్స్ వాయిదా పడినా అక్కడికి ఎగుమతయ్యే రొయ్యల ధర ఎందుకు పెరగడం లేదు’ అని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Similar News

News December 24, 2025

‘ఆరావళి’ పర్వతాలపై వివాదం ఎందుకంటే?

image

ఆరావళి పర్వతాల మైనింగ్‌పై <<18662201>>కేంద్రం<<>> వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. వీటిలో ‘100మీ. లేదా అంతకన్నా ఎత్తున్న వాటినే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు’ అని కేంద్రం చెప్పిన నిర్వచనాన్ని SC ఆమోదించింది. కానీ ఇప్పుడే కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే 91% పర్వతాలది 100 మీ. కంటే తక్కువ ఎత్తు అని, మైనింగ్‌ పేరుతో వాటిని తవ్వేయాలనే కేంద్రం ఇలా చేస్తోందని పర్యావరణవేత్తలు, ప్రజలు నిరసనలు తెలిపారు.

News December 24, 2025

PHOTO: కొత్త సర్పంచులతో సీఎం రేవంత్

image

TG: ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త సర్పంచుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. సర్పంచులను సన్మానించి, గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. ఈ సందర్భంగా వారితో రేవంత్ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.

News December 24, 2025

చైనా గుబులు: AI ఎక్కడ తిరగబడుతుందోనని ఆంక్షలు

image

AI రేసులో ముందున్నామని ప్రకటిస్తున్న చైనా లోలోపల మాత్రం ఈ అత్యాధునిక టెక్నాలజీ పట్ల ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్రంగా డేటాను విశ్లేషించి సమాధానాలిస్తున్న చాట్‌బాట్‌లు ఎక్కడ తమ కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయోనని కంగారు పడుతోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. AI మోడల్స్ ట్రైనింగ్‌ దశలోనే ప్రభుత్వ వ్యతిరేక డేటాపై జాగ్రత్తలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది.