News February 18, 2025
చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP

AP: వల్లభనేని వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోందని వైసీపీ ఆరోపించింది. గన్నవరం కేసులో అన్నీ కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలేనని.. కోర్టు లో సత్యవర్ధన్ స్టేట్‌మెంటే ఇందుకు నిదర్శనమని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, ఎవరూ బలవంతం పెట్టలేదని ఆయన చెప్పారని పేర్కొంది.
Similar News
News March 28, 2025
భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
News March 28, 2025
నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు చెన్నై వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటీలో జరగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఏఐ, ఐఓటీ వంటి పలు అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి సాయంత్రం సీఎం అమరావతికి చేరుకుంటారు.
News March 28, 2025
ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలి: పుతిన్

పుతిన్ చస్తేనే యుద్ధం ఆగిపోతుందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ <<15901820>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో UNO పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అప్పుడే ఆ దేశంలో ఎన్నికలకు వీలుంటుందని, ప్రజల విశ్వాసంతో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చలు జరపాలని అనుకుంటున్నామని చెప్పారు. దీంతో జెలెన్‌స్కీతో చర్చలకు విముఖంగా ఉన్నట్లు పరోక్ష సందేశాలిచ్చారు.