News August 3, 2024
ఎన్టీఆర్ భవన్‌లో వినతులు స్వీకరిస్తున్న చంద్రబాబు

AP: మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఆయనకు వినతిపత్రాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడుతోంది. పలువురి నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన సీఎం, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.
Similar News
News December 13, 2025
అనుకోని అతిథి ఎందుకొచ్చారు?

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చీ రావడంతోనే <<18545632>>CM రేవంత్ రెడ్డి<<>>తో, ఆ వెంటనే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతోనూ సమావేశం అయ్యారు. త్వరలోనే అఖిలేశ్ KCRను కలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో BJPకి వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విభజన రాజకీయాలు అంతం కావాలని అఖిలేశ్ చెప్పడంతో కూటమి ప్రయత్నాలే అంటూ చర్చ మొదలైంది.
News December 12, 2025
ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్, క్లింటన్, బిల్ గేట్స్ ఫొటోలు

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ <<18464497>>ఎప్‌స్టీన్ ఎస్టేట్<<>> నుంచి సేకరించిన సంచలన ఫొటోలను హౌస్ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసింది. ఇందులో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ ఫొటోలలో ఎవరూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనే విధంగా లేరని కమిటీ స్పష్టం చేసింది. కాగా <<18336928>>ఎప్‌స్టీన్ ఫైళ్ల<<>> విడుదలకు ఇటీవల ట్రంప్ ఓకే చెప్పగా ఇప్పుడు ఆయన ఫొటోలే బయటకు రావడం గమనార్హం.
News December 12, 2025
పొందూరు ఖాదీకి GI ట్యాగ్ గుర్తింపు

పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక GI ట్యాగ్ లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు X వేదికగా ప్రకటించారు. ఇది శ్రీకాకుళం నేతకార్మికుల వారసత్వానికి లభించిన అపూర్వ గౌరవమని తెలిపారు. గాంధీజీకి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్ర ఉందని, ఎన్నో కష్టాల మధ్య ఈ కళను కాపాడిన నేతకార్మికులే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. GI ట్యాగ్‌తో ఖాదీ మార్కెట్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


