News November 2, 2024
చిన్నారి హత్యాచారం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
AP: తిరుపతి జిల్లాలో చిన్నారిపై <<14509648>>హత్యాచారం<<>> ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోంమంత్రి అనిత రేపు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Similar News
News December 11, 2024
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డ్
2024-25 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరకు రవాణాలో రికార్డ్ సృష్టించింది. 249రోజులకు గానూ 5.5కోట్ల టన్నులు రవాణా చేసినట్లు పోర్టు ఛైర్మన్ ఎం.అంగముత్తు చెప్పారు. అటు, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.109కోట్ల టన్నుల సరకు రవాణా చేసినట్లు వెల్లడించారు. రవాణా ఆశించిన స్థాయిలో ఉండటంతో రైల్వే, కస్టమ్స్, జాతీయ రహదారుల సంస్థ, ప్రభుత్వరంగ సంస్థలతో పాటు అధికారులు తోడ్పాటు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
News December 11, 2024
నేడు జైపూర్‌కు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే బంధువుల వివాహానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హస్తినలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన కలుస్తారని సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. సీఎం తిరిగి గురువారం హైదరాబాద్ చేరుకుంటారు.
News December 11, 2024
అమెరికాకు తగ్గిన భారత విద్యార్థులు
ఉన్నత చదువులకు అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది తగ్గింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 64,008 మంది విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ అయ్యాయి. అదే గతేడాది, ఇదే కాలంలో లక్షకు పైగా వీసాలు మంజూరైనట్లు అమెరికన్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్ వెబ్సైట్ స్పష్టం చేసింది. కొవిడ్ తర్వాత భారత విద్యార్థులకు ఈ స్థాయిలో వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. అటు, చైనా నుంచి కూడా 8% తగ్గుదల కనిపించింది.