News November 27, 2024
టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

AP: త్వరలో జరిగే సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలని CM చంద్రబాబు TDP నేతలకు సూచించారు. MLAలు, MPలు, MLCలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘గత నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు చేపడితే ఇప్పటివరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం’ అని చెప్పారు.
Similar News
News November 9, 2025
వారంలో టెట్ నోటిఫికేషన్?

TG: టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది.
News November 9, 2025
మల్బరీలతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు!

మల్బరీ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. 3 రంగుల్లో లభించే ఈ పండ్లలో విటమిన్ బి1, బి2, బి3, బి6, సి, ఇ, ఐరన్, కాల్షియమ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, సోడియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మల్బరీల్లోని ఆంథోసైనిన్‌లు పెద్దప్రేగు, చర్మ, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని, డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు.
News November 9, 2025
అద్వానీకీ అదే న్యాయం వర్తిస్తుంది: శశిథరూర్

BJP నేత అద్వానీపై కాంగ్రెస్ MP శశిథరూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక్క ఘటనను కారణంగా చూపించి ఆయన చేసిన సుదీర్ఘ సేవను తగ్గించడం అన్యాయం. చైనా ఎదురుదెబ్బను చూపించి నెహ్రూ కెరీర్‌ను, ఎమర్జెన్సీ ఆధారంగా ఇందిరా గాంధీ రాజకీయ జీవితాన్ని నిర్వచించలేం. అద్వానీకీ అదే న్యాయం వర్తిస్తుంది’ అని తెలిపారు. విద్వేషపు విత్తనాలు నాటడం సేవ కాదని అద్వానీపై అడ్వకేట్ సంజయ్ హెగ్డే చేసిన ట్వీట్‌కు ఇలా బదులిచ్చారు.


