News June 14, 2024

ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు

image

AP: పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయంలోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్‌కు రావాలని ఆయన సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే CM అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.

Similar News

News November 2, 2025

ఆ ఓటర్లను ‘స్థానిక’ జాబితాలో చేర్చండి: SEC

image

TG: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల కసరత్తులో భాగంగా GP వార్డుల వారీగా కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని కలెక్టర్లను SEC ఆదేశించింది. గతనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈనెల 15 వరకు నమోదయ్యే ఓటర్లను లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓట్ లిస్ట్‌లో చేర్చాలని సూచించింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ముందుజాగ్రత్తగా సిద్ధం చేయాలని ఆదేశించింది.

News November 2, 2025

తాజా తాజా

image

➤ హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో వాకర్స్‌తో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
➤ HYD కేబీఆర్ పార్కులో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్
➤ SRSP 16 గేట్లు ఎత్తి 47,059 క్యూసెక్కులు.. నిజాంసాగర్ 5 గేట్లు ఎత్తి 33,190 క్యూసెక్కుల నీరు విడుదల
➤ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘NBK111’ హీరోయిన్‌ను రేపు 12.01pmకు రివీల్ చేయనున్న మేకర్స్.

News November 2, 2025

ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే..

image

మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇవి రెండు రకాలు. ఒకటి సాల్యుబుల్ ఫైబ‌ర్, రెండోది ఇన్ సాల్యుబుల్ ఫైబ‌ర్‌. దీనివల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగవుతుంది. గ్యాస్‌, అసిడిటీ, ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. కొలెస్ట్రాల్‌, బీపీ, షుగర్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. పురుషులకు రోజుకు 30 గ్రా., స్త్రీల‌కు 25 గ్రా., 2-5 ఏళ్ల పిల్ల‌ల‌కు 15 గ్రా., 5-11 ఏళ్లు పిల్లలకు 20 గ్రా. ఫైబ‌ర్ అవసరం అవుతుంది.