News June 14, 2024

ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు

image

AP: పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయంలోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్‌కు రావాలని ఆయన సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే CM అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.

Similar News

News September 19, 2024

చెప్పిన తేదీకే మెగాస్టార్ ‘విశ్వంభర’ విడుదల

image

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీలో మార్పులుంటాయని వస్తోన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘10-1-2025 విజృంభణం.. విశ్వంభర ఆగమనం!’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘విశ్వంభర’ సంక్రాంతికి రిలీజ్ అవనుంది. అయితే, మూవీ టీజర్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూడు నెలలు కూడా లేదని, అప్డేట్స్ ఇస్తూ మూవీపై ఆసక్తి పెంచాలని కోరుతున్నారు.

News September 19, 2024

ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి: షర్మిల

image

AP: తిరుమలను అపవిత్రం చేస్తూ TDP, YCPలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న CBN వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయండి. లేదా CBIతో విచారణ జరిపించండి. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి’ అని ట్వీట్ చేశారు.

News September 19, 2024

సీబీఐ విచారణ వేయండి: అంబటి రాంబాబు

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారుచేశారని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు.