News May 19, 2024
అమెరికా వెళ్లిన చంద్రబాబు
AP: టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు. ఆయన వెంట భార్య భువనేశ్వరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఐదారు రోజులపాటు చంద్రబాబు అక్కడే ఉండనున్నారు. గతంలో కూడా ఆయన వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కూడా అమెరికా వెళ్లారు.
Similar News
News December 7, 2024
GOOD NEWS: LIC స్కాలర్‌షిప్ స్కీమ్.. రేపటి నుంచి దరఖాస్తులు
టెన్త్/ఇంటర్/డిప్లొమాలో కనీసం 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈనెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో పాసైన వారు, 2024-25లో ఫస్టియర్ చదువుతున్న వారు అర్హులు.
వెబ్‌సైట్: <
News December 7, 2024
కాంబ్లీకి ‘1983 వరల్డ్‌కప్ టీమ్’ అండగా నిలుస్తుంది: గవాస్కర్
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ‘1983 వరల్డ్ కప్’ జట్టు సభ్యులు అండగా నిలిచేందుకు సిద్ధమని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపారు. ‘మా కొడుకులు, మనవళ్ల వయసున్న అనేకమంది క్రికెటర్లలో ఇబ్బందులు పడేవారిని చూస్తే చాలా బాధ కలుగుతుంటుంది. అలాంటి వాళ్లను ఆదుకుంటాం. సాయం అనే మాట వాడను కానీ కాంబ్లీకి అండగా ఉంటాం. ఏం చేయాలో చూస్తాం’ అని స్పష్టం చేశారు.
News December 7, 2024
గ్రూప్-2 అభ్యర్థులకు ALERT
గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈ నెల 9 నుంచి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TGPSC ఓ ప్రకటనలో తెలిపింది. 1,368 సెంటర్లలో ఈ నెల 15, 16వ తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9.30 గంటలు, మ.2.30 గంటలలోపే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ 5.57 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.