News April 7, 2024

చంద్రబాబు చిప్ బాగా వీక్ అయింది: VSR

image

చంద్రబాబుపై YCP నేత విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ‘చంద్రబాబు చిప్ బాగా వీక్ అయింది. ప్రచారంలో మళ్లీ హాస్యగుళికలు విసురుతున్నారు. విద్యార్థులకు రిజర్వేషన్లు తెచ్చింది ఆయనేనట! అబ్బాయిలు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి తెచ్చారట! గతంలో తాను బ్రిటిష్ వారిపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చానని బాంబు పేల్చారు. జనం ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ ఆ కామెడీ ఏంటి బాబు గారూ?’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 9, 2024

హరియాణాలో ఓడిన స్పీకర్, 8 మంది BJP మంత్రులు

image

హరియాణాలో వరుసగా మూడోసారి BJP గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత క్యాబినెట్‌లోని 10 మంది మంత్రుల్లో ఎనిమిది మంది ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా కూడా ఓడిపోయారు. దీంతో అక్కడ మంత్రివర్గంలోకి కొత్తముఖాలు కనిపించనున్నాయి.

News October 9, 2024

ఇవాళ ఈ శ్లోకాన్ని పఠించండి!

image

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. చదువులతల్లి జన్మనక్షత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయంటారు. ఇవాళ ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణినీ, నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ’ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించండి.

News October 9, 2024

కులగణనకు సిద్ధమైన ప్రభుత్వం!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైంది. నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తోంది. దీని కోసం రేవంత్ సర్కారు రూ.150 కోట్లు కేటాయించగా గైడ్ లైన్స్ ఖరారు కావాల్సి ఉంది. 30 రోజుల్లో 90వేల మంది సిబ్బందితో ఈ గణన పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు ఫైనల్ చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది.