News November 16, 2024
తమ్ముడి మృతిపై చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
AP: తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా తమ్ముడు, చంద్రగిరి మాజీ MLA రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో తెలియచేస్తున్నా. రామ్మూర్తి ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించారు. మా నుంచి దూరమై మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని Xలో ట్వీట్ చేశారు.
Similar News
News December 6, 2024
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి
TG: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల TGPSC ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశంను సర్కార్ నియమించిన విషయం తెలిసిందే.
News December 6, 2024
తెలంగాణ తల్లి.. ఏ విగ్రహం బాగుంది?
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విగ్రహాన్ని పాత విగ్రహంతో పోల్చి చూస్తున్నారు. పాత విగ్రహం కిరీటంతో, ఒక చేతిలో బతుకమ్మ, మరో చేతిలో మొక్కజొన్న కంకుతో దేవతా మూర్తిలా కనిపిస్తోందని, కొత్త విగ్రహం కిరీటం లేకుండా పచ్చ రంగు చీర ధరించి భారతీయ స్త్రీ మూర్తిలా ఉందని అంటున్నారు. మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి.
News December 6, 2024
కాసేపట్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్‌కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.