News August 10, 2024
తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు ఫోకస్!
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సా.4కు HYDలోని ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. తెలంగాణ నేతలు, కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడంపై నేతలకు CBN దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అలాగే టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయం సేకరించనున్నట్లు సమాచారం.
Similar News
News September 15, 2024
స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోకపోతే చంద్రబాబును ప్రజలు క్షమించరు: వడ్డే
AP: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కూటమి నేతలు స్పందించకపోవడం దారుణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోకపోతే చంద్రబాబును ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వైజాగ్ వచ్చి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. ఆ శాఖ సహాయ మంత్రిగా APకి చెందిన శ్రీనివాసవర్మ ఉన్నప్పటికీ బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడిందని దుయ్యబట్టారు.
News September 15, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 15, 2024
తెలుగు దర్శకుడితో లారెన్స్ 25వ మూవీ
రమేశ్ వర్మ డైరెక్షన్‌లో రాఘవ లారెన్స్ హీరోగా ఓ మూవీ తెరకెక్కనుంది. ఇది లారెన్స్ 25వ చిత్రం కావడం విశేషం. యాక్షన్ అడ్వెంచరెస్‌గా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ ఈ మూవీకి నిర్మాత వ్యవహరిస్తున్నారు. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.