News September 17, 2024
చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలి: ఎంపీ విజయసాయి

CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 19, 2025
సుప్రీం తీర్పుతో ఆ కుటుంబాల్లో ఆందోళన

కారుణ్యంతో స్వీపర్ పోస్ట్ పొందిన ఇద్దరికి విద్యార్హతల ఆధారంగా ప్రమోషన్ ఇవ్వాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఈ తీర్పుతో కారుణ్య ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న కుటుంబాలకు కంటిపై కునుకు ఉండట్లేదు. తమ విషయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉంది. ‘కష్ట సమయంలో కారుణ్యం ఓదార్పు. విద్యార్హతలు ఉంటే ప్రమోషన్‌కు కల్పించేందుకు ఇదేమీ నిచ్చెన, హక్కు కాదు’ అని SC స్పష్టం చేసింది.
News December 19, 2025
‘3 ఇడియట్స్’ సీక్వెల్ టైటిల్ ఏంటంటే?

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించనున్న ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌కు టైటిల్ ‘4 ఇడియట్స్’ అనుకుంటున్నారని తెలుస్తోంది. తొలి పార్టులో నటించిన ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషితో పాటు మరో సూపర్ స్టార్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ మూవీ 3 ఇడియట్స్ కంటే భారీగా ఉండనుందని వెల్లడించింది. నాలుగో క్యారెక్టర్‌కు న్యాయం చేసేలా కొన్ని కొత్త అంశాలు ఉంటాయని పేర్కొంది.
News December 19, 2025
18 లక్షల మందితో YCP సైన్యం: సజ్జల

AP: పార్టీ సంస్థాగత నిర్మాణానికి 35 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నామని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేతలతో భేటీలో తెలిపారు. ‘గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభ్యులందరి డేటాను డిజిటలైజ్ చేస్తాం. అంతా పూర్తయితే 16 నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతుంది. జగన్ మంచి పాలన అందించారు. ఏం కోల్పోయారో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. ఆటుపోట్లెన్ని ఉన్నా నిరంతర పోరాటమే లక్ష్యమన్నారు.


