News July 3, 2024
చంద్రబాబు కీలక నిర్ణయం

AP: శాఖలపై గతంలో గంటల పాటు సమీక్షలు నిర్వహించే CM చంద్రబాబు రూట్ మార్చారు. ఏ శాఖతో రివ్యూ అయినా 30 నిమిషాల్లోనే ముగించాలని ఉన్నతాధికారులకు సూచించారట. ఇసుక, రహదారులు, నిత్యావసరాలపై నిన్న సమీక్షించిన CM.. ఒక్కో శాఖకు 30 నిమిషాలే కేటాయించారు. అధికారులు ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాల్లోనే ముగించమని ఆదేశించారట. కందిపప్పుల ధరలు పెరగడాన్ని CM దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రంతో మాట్లాడుతామని బదులిచ్చారు.
Similar News
News December 11, 2025
స్క్రబ్ టైఫస్.. డ్రగ్ రెసిస్టెన్స్‌ను పెంచుకున్న క్రిములు!

AP: <<18454752>>స్క్రబ్ టైఫస్<<>> కేసులు, మరణాల విషయంలో కీలక అంశం వెల్లడైంది. దీని చికిత్సకు వాడే యాంటీబయాటిక్ ‘డాక్సీ సైక్లిన్’ ప్రభావం చూపడం లేదు. వ్యాధికారక క్రిములు ఔషధాలను తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. దీంతో రోగుల నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని, రిపోర్టుల తర్వాత మెరుగైన డ్రగ్స్ వాడటంపై అంచనాకు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు స్క్రబ్ టైఫస్ వల్ల 11 మంది చనిపోయారు.
News December 11, 2025
చలికాలం.. పాడి పశువుల సంరక్షణ(2/2)

ఇప్పటి వరకు పశువులకు గాలికుంటు, గొంతువాపు, చిటుక వ్యాధుల టీకాలు వేయించకపోతే వెటర్నరీ డాక్టర్ సూచన మేరకు టీకాలు వేయించాలి. బాహ్య పరాన్న జీవుల నుంచి పశువులను, జీవాలను కాపాడటానికి పాకలను, షెడ్లను శుభ్రంగా ఉంచాలి. పశువుల విసర్జితాలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. షెడ్లలో నిమ్మ గడ్డి, తులసి, వావిలాకు కొమ్మలను కట్టలుగా కట్టి వేలాడదీస్తే వీటి నుంచి వచ్చే వాసనకు బాహ్యపరాన్న జీవులు షెడ్లలోకి రాకుండా ఉంటాయి.
News December 11, 2025
యాషెస్ మూడో టెస్టుకు కమిన్స్

ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యాషెస్ సిరీస్ 3వ టెస్టుకు అందుబాటులోకి వచ్చారు. జులైలో WIతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వెన్నునొప్పికి గురైన అతను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. స్పిన్నర్ నాథన్ లయన్ కూడా ఈ టెస్టులో బరిలో దిగే ఛాన్సుంది. కమిన్స్ గైర్హాజరుతో తొలి 2 టెస్టులకు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించగా, రెండిట్లోనూ ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ నెల 17న అడిలైడ్‌లో మూడో టెస్ట్ జరగనుంది.


