News May 11, 2024

APSRTCకి చంద్రబాబు లేఖ

image

APలో మే 13న జరిగే ఎన్నికల పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని APSRTCకి చంద్రబాబు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటు స్వస్థలాలకు వెళ్లే ఓటర్లతో రోడ్లన్నీ రద్దీగా మారగా.. బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి.

Similar News

News February 18, 2025

రేపు ఢిల్లీ సీఎం ఎంపిక, ఎల్లుండి ప్రమాణం

image

ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో బీజేపీ స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 20న సా.4.30 గం.కు కాకుండా ఉ.11.30 గం.కు రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. రేపు మ.3.30 గం.కు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై సీఎం పేరును ఖరారు చేయనుంది. రేసులో పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు.

News February 18, 2025

చేతుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ పంప్, షాంపైన్ గ్లాస్.. హీరోయిన్‌పై విమర్శలు

image

హీరోయిన్ రాధికా ఆప్టే గతేడాది DECలో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 2నెలల అనంతరం తాజాగా ఆమె బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో మెరిశారు. ఈ సందర్భంగా ఓ చేతిలో బ్రెస్ట్ మిల్క్ పంపింగ్, మరో చేతిలో షాంపైన్ గ్లాస్ పట్టుకొని ఫొటో దిగారు. దీన్ని ఇన్‌స్టాలో షేర్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బిడ్డకు పాలిచ్చే సమయంలో ఆల్కాహాల్ తాగడం సరికాదని, చిన్నారి ఆరోగ్యానికి ప్రమాదమని కామెంట్స్ చేస్తున్నారు.

News February 18, 2025

సిగ్గు సిగ్గు.. సీఎంకు ఇంత అభద్రతా భావమా?: KTR

image

TG: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన KCR పుట్టినరోజున విద్యార్థులకు స్వీట్లు పంచడం తప్పా అని KTR ప్రశ్నించారు. పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ స్కూల్ HMను సస్పెండ్ చేస్తారా అని ఫైరయ్యారు. వార్డు మెంబర్ కాని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టడం, పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చా అని నిలదీశారు. సిగ్గు సిగ్గు.. CMకు ఇంత అభద్రతా భావమా అని దుయ్యబట్టారు.

error: Content is protected !!