News September 1, 2024
అమిత్ షాకు చంద్రబాబు ఫోన్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. వరద సహాయక చర్యలపై చర్చించారు. NDRF పవర్ బోట్లు పంపాలని రిక్వెస్ట్ చేశారు. అవసరమైన సాయం చేస్తామని అమిత్ షా సీఎంకు హామీ ఇచ్చారు. 6 NDRF టీంలు, 40 పవర్ బోట్లు తక్షణమే ఏపీకి పంపుతున్నామని, రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని హోంశాఖ సెక్రటరీ తెలిపారు. సహాయక చర్యల కోసం 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 11, 2024
ఇడ్లీ, దోసె పిండిని ఎన్ని రోజులు వాడొచ్చు?
ఇడ్లీ, దోసె పిండిని కొందరు వారంపాటు ఫ్రిజ్‌లో దాచుకుని వాడతారు. ఆ పిండిని రోజుల తరబడి ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు ఫ్రిజ్‌లో పెడితే అతిగా పులుస్తుంది. దానిని తింటే కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్కువగా పులిసిన పిండిని బయటపడేయాలి. ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే వాడాలి. తాజాగా తింటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
News September 11, 2024
ఇండియా-ఎ జట్టులోకి తెలుగు కుర్రాడు
ఆంధ్ర యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ ఇండియా-ఎ జట్టుకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. రేపు అనంతపురంలో ఇండియా-డితో జరగబోయే మ్యాచ్‌లో రషీద్ బరిలోకి దిగనున్నారు. కాగా రషీద్ గతంలో ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్నారు.
News September 11, 2024
వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్: ఏది బెటర్?
చాలామంది వైట్ ఎగ్ కన్నా బ్రౌన్ ఎగ్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. ధర ఎక్కువైనా వాటినే కొంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని పరిశోధకులు తేల్చారు. పెంకు రంగులోనే తేడా ఉంటుందని, రెండు గుడ్లలోనూ సమాన పోషకాలు ఉంటాయన్నారు. పెంకు రంగు మారటం వల్ల రుచి, నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు. బ్రౌన్ ఎగ్ పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉంటాయి. వాటిని పెంచేందుకు ఖర్చు ఎక్కువ కావటంతో ఆ గుడ్లను అధిక ధరకు విక్రయిస్తారు.