News September 27, 2024

చంద్రబాబు చేసిన పాపం ప్రజలపై పడకుండా పూజలు చేయాలి: జగన్

image

AP: మానవత్వం చూపేదే హిందూ మతమని, మానవత్వం చూపనివాళ్లు తాము హిందువని చెప్పుకోలేరని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ‘తిరుమల గొప్పదనాన్ని, లడ్డూ విశిష్టతను చంద్రబాబే నాశనం చేశారు. నన్ను గుడికి పంపినా, పంపకపోయినా CBN చేసిన పాపం ప్రజల మీద పడకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలో పూజలు నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు.

Similar News

News October 15, 2024

రేపు క్యాబినెట్ భేటీ.. కీలక పథకానికి ఆమోదం?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మహిళలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌‌, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగంపై 5-6 నూతన పాలసీలు క్యాబినెట్ ముందుకు వస్తాయని తెలుస్తోంది.

News October 15, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?

image

దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్‌లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.

News October 15, 2024

కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు

image

కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.