News April 11, 2024

చంద్రబాబు స్టైలే వేరు: విజయసాయిరెడ్డి

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘బాధ్యత కలిగిన నాయకులు బియ్యం, పప్పు, ఉప్పు, వంటనూనెల ధరలు తగ్గిస్తామని హామీలివ్వడం చూశాం. కానీ చంద్రబాబు స్టైలే వేరు కదా! మద్యం ధరలు తగ్గిస్తానని ముసిముసిగా నవ్వుతున్నాడు. ఆయన దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనేమో!’ అని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News February 1, 2026

సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో త్వరలో జరిగే సదస్సుకు ఆహ్వానం అందింది. ఏఐ పాలసీ సదస్సుకు రావాలని కోరింది. ఈ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం వర్చువల్‌గా సదస్సుకు హాజరవుతానని రిప్లై ఇచ్చారు. కాగా ఇటీవల ఆయన హార్వర్డ్‌ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్‌లో ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్‌ అందుకున్న విషయం తెలిసిందే.

News February 1, 2026

రేషన్‌లో గోధుమ పిండి.. నేటి నుంచే పంపిణీ

image

AP: ప్రభుత్వం రేషన్‌లో గోధుమ పిండిని పంపిణీ చేయనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో ఇవాళ్టి నుంచి కిలో రూ.20కే అందజేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలోనే మండల స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని తెలిపారు. దీపం పథకం కింద నాలుగో విడత రాయితీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని, మార్చి నెలాఖరు లోపు బుక్ చేసుకోవాలని సూచించారు.

News February 1, 2026

‘కాపు నేత’పై దాడి అని వైసీపీ ట్వీట్

image

AP: YCP నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై TDP కార్యకర్తలు దాడి చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ‘కాపు నేత’పై టీడీపీ దాడి చేసిందని వైసీపీ అఫీషియల్ X పేజీలో #TDPAntiKapu అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసింది. ‘నాడు వంగవీటి రంగాను హత్య చేశారు. మొన్న ముద్రగడ కుటుంబంపై, నేడు అంబటిపై దాడి చేశారు. తర్వాత మాపై దాడి చేస్తారా?’ అని మాజీ మంత్రి తోట త్రిమూర్తులు మండిపడ్డారు.