News April 11, 2024
చంద్రబాబు స్టైలే వేరు: విజయసాయిరెడ్డి

AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘బాధ్యత కలిగిన నాయకులు బియ్యం, పప్పు, ఉప్పు, వంటనూనెల ధరలు తగ్గిస్తామని హామీలివ్వడం చూశాం. కానీ చంద్రబాబు స్టైలే వేరు కదా! మద్యం ధరలు తగ్గిస్తానని ముసిముసిగా నవ్వుతున్నాడు. ఆయన దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనేమో!’ అని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News March 15, 2026
TVKతో పొత్తు ఉండదు: పళనిస్వామి

TNలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో TVKతో పొత్తు ఉండబోదని AIADMK జనరల్ సెక్రటరీ K.పళనిస్వామి తెలిపారు. మీడియాలో వస్తున్నవంతా వదంతులేనని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీతో అసలు చర్చలే జరపలేదన్నారు. అలాగే BJP లీడర్ అన్నామలైతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు NDAతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్టార్ హీరో, TVK చీఫ్ విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
News March 15, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు 8.30am వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడటానికి ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక రానున్న 5 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2-4డిగ్రీలు తగ్గుతాయంది.
News March 15, 2026
చంద్రబాబుకు అల్లు అర్జున్ థాంక్స్

AP సీఎం చంద్రబాబు నాయుడికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. శిరీష్, నయనిక దంపతులను <<19384357>>ఆశీర్వదించడానికి<<>> శనివారం అల్లు ఇంటికి చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో విదేశాల్లో ఉన్న ఐకాన్ స్టార్.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన Xలో పోస్ట్ చేసి సీఎంకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.


