News October 4, 2024
చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది: జగన్
AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తిచూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మతవిశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించింది’ అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.
Similar News
News November 12, 2024
మహారాష్ట్ర పోల్ బ్యాటిల్: మరాఠీ Vs గుజరాతీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని మరాఠీ Vs గుజరాతీల మధ్య ప్రాంతీయ పోరుగా విపక్ష MVA న్యారేటివ్ బిల్డ్ చేస్తోంది. MH అవకాశాలను ఇతర రాష్ట్రాలు దోచుకుంటున్నాయని ఇటీవల రాహుల్ గాంధీ విమర్శించారు. ఫాక్స్‌కాన్, వేదాంత కంపెనీలు MH నుంచి గుజరాత్‌కు తరలిపోవడాన్ని నేతలు ఉదాహరిస్తున్నారు. మరాఠీ పార్టీలైన శివసేన, NCPలను చీల్చి BJP అధికారాన్ని లాక్కుందని మరాఠీ న్యారేటివ్ సెట్ చేస్తున్నారు.
News November 12, 2024
క్రికెట్‌లోకి షమీ రీ ఎంట్రీ.. ఎప్పుడంటే..
పేసర్ మహ్మద్ షమీ సుమారు ఏడాది గ్యాప్ తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. రేపు మధ్యప్రదేశ్, బెంగాల్ మధ్య జరిగే రంజీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆయన ఫిట్‌గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ ధ్రువీకరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ODI వరల్డ్ కప్ ఫైనల్లో షమీ చివరిగా ఆడారు. రంజీల్లో బౌలింగ్ బాగుంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు ఏదో విధంగా ఆయన్ను టీమ్ ఇండియా ఆడించే అవకాశం ఉంది.
News November 12, 2024
అమెరికన్ M4 రైఫిల్స్.. అఫ్గాన్ టు భారత్ వయా పాక్
ఇటీవల J&Kలో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన ఆర్మీ అత్యాధునిక అమెరికన్ M4 కార్బైన్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇవి అఫ్గాన్ నుంచి పాక్ టెర్రరిస్టులకు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. US బలగాలు 2021లో అఫ్గాన్‌ను వీడుతూ $7bn విలువైన ఆయుధాలను వదిలేశాయి. వాటిలో వేలాదిగా M4 రైఫిల్స్ ఉన్నాయి. లైట్ వెయిట్‌తో ఉండే వీటి ద్వారా నిమిషానికి 700-900 రౌండ్స్ కాల్చవచ్చు. రేంజ్ 500M-3,600M వరకు ఉంటుంది.