News March 23, 2024

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్‌షాప్ ప్రారంభం

image

AP: వచ్చే 50 రోజుల ఎన్నికల ప్రణాళికపై టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేసేందుకు చంద్రబాబు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన నేతలు కూడా హాజరయ్యారు. ఎన్నికల నియమావళి, పోల్ మేనేజ్‌మెంట్, అభ్యర్థులకు ఉండే హక్కులు, ప్రచారం, నామినేషన్ల దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు సూచనలు చేస్తారు.

Similar News

News July 9, 2025

మైనింగ్ బ్లాక్‌పై ఫిర్యాదులు.. స్పందించిన పవన్

image

AP: విజయనగరంలో దేవాడ మైనింగ్ బ్లాక్‌ విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మాంగనీస్ తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను పరిగణించలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో ఆ జిల్లా అధికారులతో పవన్ చర్చించారు. మైనింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

News July 9, 2025

రేపు మరోసారి ఆస్పత్రికి కేసీఆర్

image

TG: బీఆర్ఎస్ అధినేత KCR రేపు ఉదయం మరోసారి HYD సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో 2రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన నంది‌నగర్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. రేపు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

News July 9, 2025

ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.