News March 23, 2024
ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్‌షాప్ ప్రారంభం
AP: వచ్చే 50 రోజుల ఎన్నికల ప్రణాళికపై టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేసేందుకు చంద్రబాబు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన నేతలు కూడా హాజరయ్యారు. ఎన్నికల నియమావళి, పోల్ మేనేజ్‌మెంట్, అభ్యర్థులకు ఉండే హక్కులు, ప్రచారం, నామినేషన్ల దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు సూచనలు చేస్తారు.
Similar News
News September 15, 2024
శుభ ముహూర్తం
తేది: సెప్టెంబర్ 15, ఆదివారం
ద్వాదశి: సాయంత్రం 6.12 గంటలకు
శ్రవణం: సాయంత్రం 6.48 గంటలకు
వర్జ్యం: రాత్రి 10.26-11.53 గంటల వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4.30-5.19 గంటల వరకు
News September 15, 2024
నేటి ముఖ్యాంశాలు
* సీతారాం ఏచూరి పార్థివదేహం ఎయిమ్స్‌కు అప్పగింత
* TG: ముడి పామాయిల్ దిగుమతులపై పన్ను పెంపు: మంత్రి తుమ్మల
* త్వరలో హైడ్రాకు మరిన్ని అధికారాలు: రంగనాథ్
* కౌశిక్ ఇంటిపై దాడి రేవంత్ పనే: KTR
* ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్సే: మంత్రి పొన్నం
* AP: స్టీల్‌ప్లాంట్‌ను రక్షించలేకపోతే రాజీనామా చేస్తాం: పల్లా
* వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల
News September 15, 2024
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య: మాజీ మంత్రి
AP: మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే తగ్గించేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీట్ల భర్తీకి NMC ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు బాధాకరం. కాలేజీల్లో మౌలిక సదుపాయాలకు NMC నిధులిస్తే వద్దన్న ఘనత చంద్రబాబుదే. మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య. విద్యార్థులకి ద్రోహం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.