News April 11, 2024
ఆ నియోజకవర్గాల్లో YCP అభ్యర్థుల మార్పు?

AP: రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో YCP తమ అభ్యర్థులను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైలవరం-జోగి రమేశ్, విజయవాడ వెస్ట్-పోతిన మహేశ్, గుంటూరు2- కిలారు రోశయ్య, గుంటూరు ఎంపీ-విడదల రజినీ, కర్నూలు ఎంపీ-KE ప్రభాకర్, పి.గన్నవరం-పాముల రాజేశ్వరి, అవనిగడ్డ-సింహాద్రి చంద్రశేఖర్, చిలకలూరిపేట-మర్రి రాజశేఖర్, రాయచోటి-రెడ్డప్పగారి రమేశ్ రెడ్డికి సీట్లు కేటాయిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Similar News
News December 9, 2025
పాకిస్థాన్‌కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్‌కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్‌ను తప్పించుకుంది.
News December 9, 2025
హైదరాబాద్‌లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్(NI-<
News December 9, 2025
శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.


