News July 12, 2024
నా ఆఫీసు నుంచే మార్పు మొదలు: పవన్ కళ్యాణ్

AP: చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం తన క్యాంప్ ఆఫీసు, పార్టీ ఆఫీసు, పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని డిప్యూటీ CM పవన్ వెల్లడించారు. ‘నిపుణుల ద్వారా వ్యర్థాల నిర్వహణపై అందరికీ అవగాహన కల్పిస్తాం. దీని ద్వారా ఏటా రూ.2643 కోట్ల సంపద సృష్టించడంతో పాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ ఆదాయాన్ని కార్మికులకు కేటాయిస్తాం’ అని వ్యర్థాల నిర్వహణపై సమీక్ష అనంతరం ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News February 18, 2025
ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.
News February 17, 2025
టీమ్ ఇండియా ఫొటోషూట్.. పిక్స్ వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా ఫొటో సెషన్‌లో పాల్గొంది. ఇందులో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు సందడి చేశారు. టీ20 టీమ్, టెస్టు టీమ్ క్యాప్‌లు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ జెర్సీలపై పాకిస్థాన్ అని పేరు రాసి ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
News February 17, 2025
కుంభమేళాలో నేడు 1.35కోట్ల మంది స్నానాలు

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. దేశ నలుమూలల నుంచి తరలి వస్తుండటంతో ప్రయాగ్‌రాజ్ కిటకిటలాడుతోంది. నేడు త్రివేణీ సంగమంలో 1.35 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 54.31 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ విచ్చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 26తో మహాకుంభమేళా ముగియనుంది.