News December 25, 2024
సంక్రాంతి సెలవుల్లో మార్పులు!
APలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం పండుగ హాలిడేస్ JAN 10-19 తేదీల్లో ఉంటాయని విద్యాశాఖ గతంలో పేర్కొంది. కానీ ఇటీవల భారీ వర్షాలతో చాలా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. దీంతో పనిదినాలు తగ్గొద్దంటే ఈ సెలవులు తగ్గించాలి. ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
Similar News
News January 14, 2025
గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం: CM
TG: ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటించబోతున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. సింగపూర్‌లో స్కిల్ వర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతామన్నారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటామని చెప్పారు. గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. గత ఏడాది దావోస్‌లో ₹40,232 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.
News January 14, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ పబ్లిక్ టాక్
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని, వెంకీ నటన ఇరగదీశారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్టోరీ అంతగా లేదని, లాజిక్స్ వెతకకుండా చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News January 14, 2025
నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు: భట్టి
TG: రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న 4 సంక్షేమ పథకాల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు, రైతు భరోసాకు రూ.18వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.