News June 6, 2024

వాలంటీర్ వ్యవస్థలో మార్పులు.. నిజమెంత?

image

AP: వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పులు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వాలంటీర్ ఉన్నత వర్గాలు తెలిపాయి. దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఫేక్ వార్తలను నమ్మకండని సూచించాయి. కాగా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణతను ప్రామాణికంగా తీసుకొని 1994 నుంచి 2003 వరకు వయోపరిమితిగా నిర్ణయించనున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.

Similar News

News October 18, 2024

శ్వేతపత్రాలపై ఏం చేశారు? నివేదికివ్వండి: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ సీఎం చంద్రబాబు 2 నెలల కిందట పలు రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే ఆయా శాఖలు వాటిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాయో ప్రభుత్వానికి నివేదించలేదు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

News October 18, 2024

హరీశ్ రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి హరీశ్‌రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపై మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదైంది. తనకు తెలియకుండా ఇంటిని అమ్మేశారని, అక్రమంగా వచ్చి ఉంటున్నారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జంపన ప్రభావతి, తన్నీరు గౌతమ్, తన్నీరు పద్మజారావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్, గారపాటి నాగరవిపై కేసు నమోదైంది.

News October 18, 2024

‘రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. పోలీసులకు మెసేజ్

image

సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్‌లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘లైట్‌గా తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వం ఆగిపోవాలన్నా సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే ఘోరంగా ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.