News February 17, 2025

పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు: HC

image

పేరు ఎంపిక/మార్చుకోవడం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యాశాఖ తన స్కూలు సర్టిఫికెట్‌లోని పేరును మార్చడానికి నిరాకరించిందంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ కింద వాక్ స్వాతంత్ర్యం, 21వ అధికరణ కింద వ్యక్తిగత స్వేచ్ఛ, 14వ అధికరణ కింద పేరు మార్పు వ్యక్తిగత స్వేచ్చ, ప్రాథమిక హక్కులో ఒకటని HC పేర్కొంది.

Similar News

News April 20, 2026

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.

News April 20, 2026

ఇక నుంచి యాక్టివ్‌గా కేసీఆర్!

image

TG: నేడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల (2024) తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు జరగబోయే సభ రాజకీయంగా కీలకంగా మారనుంది. కేసీఆర్ ఇక నుంచి యాక్టివ్ అవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై నేటి సభలో విరుచుకుపడతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి.