News November 7, 2024
చిరంజీవి చేతిలో చరణ్, బన్నీ దెబ్బలు తిన్నారు: వరుణ్ తేజ్
తాము సక్రమంగా పెరగడం వెనుక తన పెదనాన్న చిరంజీవిది ప్రధాన పాత్ర అని నటుడు వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘చిరంజీవిగారు మాకు గర్వం తలకెక్కకుండా పెంచారు. ఆయనో హెడ్‌మాస్టర్ తరహా. బెత్తంతో నన్ను, చరణ్, బన్నీని దారిలో పెట్టారు. చిన్నవాడిని కాబట్టి నాకంటే ఎక్కువగా వాళ్లిద్దరికే బడితెపూజ జరిగేది. ప్రతి సంక్రాంతికి అందరం 4రోజులు కచ్చితంగా పెదనాన్న ఇంట్లో గడుపుతాం’ అని గుర్తుచేసుకున్నారు.
Similar News
News December 8, 2024
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త రూల్స్
అత్యవసర పరిస్థితుల్లో ఐజీ లేదా ఆ పైస్థాయి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాపింగ్‌కు ఆదేశించిన అధికారి సదరు ఆదేశాలు నిజమైనవేనని 7 పనిదినాల్లో నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను దేనికీ వాడొద్దని, 2 రోజుల్లో ఆ డేటాను ధ్వంసం చేయాలని తెలిపింది. ట్యాపింగ్ ఆదేశాలను సంబంధిత శాఖల కార్యదర్శుల కమిటీ సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.
News December 8, 2024
12న ఏపీలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక- తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
News December 8, 2024
యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం
TG: కార్తీకమాసంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, హుండీల ద్వారా యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది. ఒక్క నెలలో రూ.18.03కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. గతేడాది ఇదే మాసంలో రూ.15.08 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయం విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.25.52లక్షలు వచ్చినట్లు అధికారి వివరించారు.