News May 18, 2024

ఐదుగురు SIలు, సీఐకి ఛార్జ్ మెమో

image

AP: కడప గౌస్‌నగర్‌లో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య పోలింగ్ రోజున జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ భాస్కర్‌రెడ్డి, ఐదుగురు ఎస్సైలు రంగస్వామి, తిరుపాల్ నాయక్, మహమ్మద్ రఫీ, ఎర్రన్న, అలీఖాన్‌లకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన ఎస్పీ.. ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Similar News

News December 8, 2024

ఈ స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది: జగన్

image

APలో నిన్న జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌పై YCP అధినేత జగన్ స్పందించారు. ‘సహజంగా జరిగే ఈ సమావేశాలు ఇప్పుడే జరుగుతున్నట్లు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తే ఆశ్చర్యమేస్తోంది. మా హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన స్కూళ్లను, విద్యారంగాన్ని నాశనం చేస్తూ, అమ్మకు వందనం ఇవ్వకుండా దగా చేశారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటివి చేయగలరు. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News December 8, 2024

నాగచైతన్య-శోభిత పెళ్లి.. మరికొన్ని ఫొటోలు

image

నాగచైతన్య-శోభితల వివాహం ఈ నెల 4న అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లి వేడుకకు సంబంధించి మరికొన్ని ఫొటోలను శోభిత పంచుకున్నారు. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అంటూ తలంబ్రాల బట్టలు ప్రధానం చేయడం, తలంబ్రాలు వేయడం, అరుంధతీ నక్షత్రం చూపించడం వంటి సందర్భాల ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

News December 8, 2024

రామప్పకు రూ.73 కోట్ల నిధులు విడుదల

image

TG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.73 కోట్ల నిధులు కేటాయించింది. ఈమేరకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది. కేంద్ర పథకం కింద స్థానికంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. కాటేజీలతో పాటు గార్డెన్, యాంఫీ థియేటర్, లేక్ వ్యూ కాటేజీలు, ఆట స్థలాలు, బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు.