News December 16, 2024
UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు.. కేంద్రం స్పష్టత

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్చెక్ స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI)పైనే ఛార్జీలు ఉంటాయంది.
Similar News
News December 9, 2025
బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్?

బ్లాక్బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్తో తెరకెక్కనుందని సమాచారం. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’లో ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
News December 9, 2025
చాట్ జీపీటీతో కొత్త వంగడాల సృష్టి సులభమా?

వాతావరణ మార్పులు, కరవు, వరదల వల్ల వ్యవసాయంలో కొత్త వంగడాల అవసరం పెరిగింది. కొత్త వంగడాల అభివృద్ధికి ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా గుర్తించగలదు.
News December 9, 2025
తేగలు తింటే ఎన్ని లాభాలో..!

శీతాకాలంలో తాటి తేగలు (గేగులు) ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే తేగల్లో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత నివారణ, శరీర బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్థులూ తినొచ్చు. తాటి గింజలు మొలకెత్తినప్పుడు నేలలో నుంచి తవ్వి తీసిన మొలకలే ఈ తేగలు. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? comment


