News March 23, 2024
ప్రచారానికి సిద్ధమవుతున్న రథాలు
ఎన్నికల పర్వంలో ప్రచార రథాలదే కీలక పాత్ర. ప్రతి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఇవి లేకుంటే ప్రచారం ముందుకు సాగదు. పోలింగ్ తేదీకి మరో 50 రోజులే ఉండటంతో ఆయా పార్టీల నేతలు ప్రచార రథాలను ఆధునిక హంగులతో తయారు చేయించుకుంటున్నారు. ముఖ్య నేతల చిత్రాలతో పాటు అభ్యర్థి కూడా కనిపించే విధంగా సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రచారాలు హోరెత్తనున్నాయి.
Similar News
News September 8, 2024
9 కిలోల బంగారం సీజ్ చేసిన ఈడీ
బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో ఓ ఇంట్లో సోదాలు చేస్తున్న ED అధికారులు కళ్లు చెదిరే బంగారం డంప్‌ను గుర్తించారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో వ్యాపారవేత్త స్వపన్ సాహా నివాసంలో ED సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో రూ.6.5 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని గుర్తించింది. దీనికి సంబంధించి సాహా సరైన పత్రాలను చూపకపోవడంతో సీజ్ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం సాహాను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది.
News September 8, 2024
చంపేస్తామంటూ బజరంగ్ పునియాకు బెదిరింపులు
కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియాను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. ఓ ఫారిన్ నంబర్ నుంచి వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వినేశ్ ఫొగట్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం పునియాను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా ఆ పార్టీ నియమించింది.
News September 8, 2024
మరో 5 జిల్లాల్లో రేపు సెలవు
APలో మరో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు రేపు సెలవు ప్రకటించారు. అతిభారీ వర్షాల దృష్ట్యా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో సెలవు ఇచ్చారు.