News February 27, 2025

ఎండోమెంట్ పరిధిలోకి చార్మినార్ ‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారి ఆలయం

image

హైదరాబాద్‌లోని చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్‌ను ఎండోమెంట్ పరిధిలోకి తెస్తూ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. ఆలయానికి తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. యూపీకి చెందిన రాజ్‌మోహన్ దాస్ టెంపుల్‌పై ఆజమాయిషీ చెలయిస్తున్నాడంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ఆ వివాదం నడుస్తుండగానే ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆలయాన్ని దేవదాయ పరిధిలోకి తెస్తూ తీర్పునిచ్చింది.

Similar News

News February 27, 2025

#WeStandWithPosani అంటున్న వైసీపీ శ్రేణులు

image

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

News February 27, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?

image

TG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.

News February 27, 2025

రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

image

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!