News March 8, 2025
‘ఛావా’కు తొలి రోజు రూ.3 కోట్లు!

బాలీవుడ్‌లో దాదాపు రూ.480 కోట్లు కలెక్ట్ చేసిన ‘ఛావా’ మూవీ నిన్న తెలుగులో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ వస్తోంది. డబ్బింగ్ ఏమాత్రం బాగాలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు డైలాగులపై ఫోకస్ చేయాల్సిందంటున్నారు. గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున విడుదల చేసినా తొలి రోజు కేవలం రూ.3కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News March 26, 2025
సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్

TG: BRS హయాంలో తనపై PD యాక్ట్ పెట్టినప్పుడు కొందరు BJP నేతలే జైలుకు పంపాలని పోలీసులకు చెప్పారని BJP MLA రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పుడూ కొందరు ఎలా వెన్నుపోటు పొడవాలో ఆలోచిస్తున్నారని వాపోయారు. ఇక తాము అధికారంలోకి వస్తే పోలీసులపై చర్యలుంటాయన్న KTR కామెంట్స్‌పై స్పందించారు. అప్పట్లో KTR ఆదేశాలతో రేవంత్‌ను బెడ్రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని ఇప్పుడాయన CM అయినా వారిని ఏం చేయలేకపోతున్నట్లు చెప్పారు.
News March 26, 2025
బాలీవుడ్‌లో సెటిల్ అవుతారా? శ్రీలీల సమాధానమిదే

తాను బాలీవుడ్‌లో సెటిల్ అవుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరోయిన్ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టాలీవుడ్ తనకు ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. మెడిసిన్ ఫైనలియర్ చదివేందుకు కొన్ని సినిమాలు వదులుకున్నట్లు వెల్లడించారు. నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ ఎల్లుండి రిలీజ్ రానుంది. కాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
మంత్రివర్గ విస్తరణకు వేళాయే

APR 3న TG క్యాబినెట్ విస్తరణ జరగనుంది. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. రెడ్లలో రాజగోపాల్, సుదర్శన్, ఎస్సీల్లో వివేక్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీసీల్లో మాత్రం 2 పదవులకు ముగ్గురు పోటీ పడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నారు.