News February 17, 2025
‘ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.
Similar News
News November 17, 2025
MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
News November 17, 2025
అజొల్లాను ఎలా ఉత్పత్తి చేయవచ్చు?(2/2)

గోతిలో మట్టిని చల్లిన తర్వాత ఆవు పేడ 2kgలు, 30 గ్రాముల సూపర్ ఫాస్పేట్ను 10 లీటర్ల నీటిలో కలిపి గుజ్జుగా తయారు చేసి ఆ మట్టిపై పోయాలి. తొట్టెలో ఎప్పుడూ 10cm నీటిమట్టం ఉండాలి. ఆ నీటిలో 500 గ్రాముల నుంచి కిలో వరకూ తాజా అజొల్లా కల్చరును బెడ్ మీద సమానంగా చల్లాలి. దీని వల్ల అజొల్లా త్వరగా పెరిగి గొయ్యి మొత్తం ఆక్రమిస్తుంది. 10 నుంచి 15 రోజుల తర్వాత నుంచి రోజుకు 500 నుంచి 600 గ్రాముల అజొల్లా పొందవచ్చు.
News November 17, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్తో పాటు వివిధ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.


