News February 17, 2025
‘ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.
Similar News
News March 23, 2025
LSGలోకి స్టార్ ఆల్‌రౌండర్ ఎంట్రీ

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. అతడి బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. గాయం కారణంగా IPL నుంచి తప్పుకున్న మొహ్సిన్ ఖాన్ స్థానంలో అతడిని తీసుకుంది. త్వరలో ఆయన జట్టుతో చేరనున్నారు. కాగా గతంలో శార్దూల్ ఠాకూర్ CSK, PBKS, KKR, DC, RPS జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 95 మ్యాచులాడి 94 వికెట్లు, 307 పరుగులు చేశారు.
News March 23, 2025
డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కిషన్ రెడ్డి

TG: దేశంలో లేని సమస్యను సృష్టించి, బీజేపీకి వ్యతిరేకంగా నిన్న చెన్నైలో డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి పనిచేస్తోందని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. నిన్నటి సమావేశంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాత బంధం బయటపడిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
News March 23, 2025
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు టికెట్ల విడుదల

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్) కోటా, వసతి టికెట్ల కోటా విడుదల తేదీని ప్రకటించింది. రేపు ఉదయం 10గంటల నుంచి దర్శనం టికెట్లు, రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి వసతి టికెట్ల బుకింగ్‌ను ఓపెన్ చేయనుంది. ముందుగా రూ.300 టికెట్లు లేదా ఇతర దర్శనం టికెట్లు పొందినవారికి మాత్రమే వసతి గదుల బుకింగ్ సదుపాయం లభిస్తుంది.