News March 11, 2025
‘ఛావా‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా‘ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11న ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. కాగా బాలీవుడ్‌లో దుమ్మురేపిన ఈ మూవీ తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజులకే రూ.10 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Similar News
News March 24, 2025
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
News March 24, 2025
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
News March 24, 2025
పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్‌సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.