News January 27, 2025
ఛావా: శివాజీ డాన్స్ సీన్ తొలగిస్తున్న చిత్ర యూనిట్

‘ఛావా’లో విక్కీ కౌశల్, రష్మిక మందన్న లెజిమ్ <<15278092>>డాన్స్<<>> సీన్‌ను తొలగించేందుకు సినిమా యూనిట్ సిద్ధమైంది. మహారాష్ట్ర మంత్రులు, చరిత్రకారుల అభ్యంతరాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని డైరెక్టర్ లక్ష్మణ్ ఉఠేకర్ అన్నారు. అంతకు ముందే ఆయన MNS అధినేత రాజ్‌ఠాక్రేను కలిశారు. ఛత్రపతీ శివాజీ మహారాజ్‌పై వచ్చిన ఛావా పుస్తకాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఆయన ఘనతను ప్రపంచానికి తెలియజేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.
Similar News
News February 8, 2025
27 ఏళ్ల బీజేపీ కరవు తీర్చిన ₹12L ట్యాక్స్ మినహాయింపు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కమలం గెలుపు దాదాపు ఖాయమేనని విశ్లేషకుల అంచనా. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మిడిల్ క్లాస్‌ను బీజేపీ వైపు తిప్పిందని పేర్కొంటున్నారు. అలాగే పదేళ్ల ఆప్ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కూడా కలిసొచ్చిందని చెబుతున్నారు.
News February 8, 2025
అలాంటి ఇంటి పట్టాల రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: YCP హయాంలో ఇంటి పట్టాలు పొందిన అనర్హులను గుర్తించి రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు కారు ఉందా? కుటుంబంలో ఎక్కువ మంది పట్టాలు పొందారా? తదితర వివరాలు సేకరించాలని పేర్కొంది. కాగా జగన్ ప్రభుత్వంలో 22.80L మందికి ఇంటిస్థలాలు ఇచ్చారు. వీరిలో 15.71L మందికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన 7L మందిలోనే అనర్హులు ఉన్నట్లు సమాచారం.
News February 8, 2025
ఆప్‌కు కాంగ్రెస్ ‘ఓట్ షేరింగ్’ దెబ్బ

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలు ఆప్‌కు అధికారాన్ని దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ పార్టీ దారుణంగా చీల్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15% ఓట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.26 % ఓట్లు రాగా, ప్రస్తుతం 17% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆప్‌కు దక్కాల్సిన మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది.