News January 7, 2025

CHECK: ఈ లిస్టులో మీ పేరుందా?

image

AP, TGకి సంబంధించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ-2025 తుది జాబితాను ఎన్నికల కమిషనర్లు నిన్న ప్రకటించారు. APలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లుండగా కొత్తగా 5.14 లక్షల మంది చేరారు. TGలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లుండగా కొత్తగా 2.19 లక్షల మంది నమోదయ్యారు. వీరికి త్వరలోనే పోస్టు ద్వారా ఎపిక్ కార్డులను అందజేయనున్నారు. కాగా ఫైనల్ <>జాబితాలో<<>> మీ పేరును చెక్ చేసుకోండి.

Similar News

News January 8, 2025

టాటా సుమో మళ్లీ వస్తోంది!

image

1990, 2000ల్లో విపరీతమైన ఆదరణ పొందిన టాటా సుమో మళ్లీ వచ్చే అవకాశముంది. ఈ సంవత్సరం టాటా మోటార్స్ ఈ వాహనాన్ని రీలాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని అలాగే ఉంచి ఆధునాతన ఫీచర్లతో ఈ SUVని రూపొందించనున్నట్లు సమాచారం. ధర రూ.10-15 లక్షలుగా నిర్ణయించే ఛాన్స్ ఉంది. కాగా టాటా సుమో తొలి మోడల్ 1994లో వచ్చింది.

News January 8, 2025

వారి ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలకు పెంపు

image

AP: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.

News January 8, 2025

సీఎం ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000: KTR

image

TG: నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ కృష్ణవేణి హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం పెట్టారని వచ్చిన ఆరోపణలపై KTR స్పందించారు. ‘ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000 మాత్రమే. కానీ చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారు. వారెవ్వా ప్రజాపాలన. శభాష్ ఇందిరమ్మ రాజ్యం’ అని ట్వీట్ చేశారు. కాగా అల్పాహారంలో విద్యార్థినులకు గొడ్డు కారం పెట్టారని పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.