News December 12, 2024

క్లీంకార ఇప్పుడెలా ఉందో చూడండి!

image

రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార చూస్తుండగానే పెరిగిపోయింది. తన తాతతో క్లీంకార ఆలయాన్ని సందర్శించిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. ‘ఈరోజు మా హాస్పిటల్ టెంపుల్‌లోని వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన ముత్తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. తాత చేతుల్లో తనను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.

Similar News

News October 29, 2025

డేటా లీక్.. వెంటనే పాస్‌వర్డ్స్ మార్చుకోండి!

image

భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు AUS సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ధ్రువీకరించారు. వీటిలో Gmail ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. మాల్‌వేర్ ద్వారా దొంగిలించిన లాగిన్ ఐడీలతో మొత్తం 3.5 టెరాబైట్ల (875 HD సినిమాలకు సమానం) డేటాను హ్యాకర్స్ రూపొందించారు. మీ ఖాతా వివరాలు లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకుని, వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని ట్రాయ్ సూచించారు.

News October 29, 2025

అరటి పరిమాణం పెంచే ‘బంచ్‌ ఫీడింగ్‌’ మిశ్రమం

image

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్‌ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్‌ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.

News October 29, 2025

వైకుంఠాన్ని చేర్చే మార్గం కార్తీకమాసం

image

పుణ్యకాలాలన్నింటిలోకెల్లా కార్తీకమాసం అత్యుత్తమమైనది. వేదాల కంటే గొప్ప శాస్త్రం, గంగ కంటే గొప్ప తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మంతో సమానమైన స్నేహం లేనట్టే.. ఈ కార్తీక మాసానికి సాటి వచ్చే పుణ్య కాలం లేదు. కార్తీక దామోదరుని (విష్ణువు) కంటే గొప్ప దైవం మరొకరు లేరు. ఈ సత్యాన్ని తెలుసుకొని, ఈ మాసంలో భక్తితో ధర్మాన్ని ఆచరించే వ్యక్తి తప్పక వైకుంఠాన్ని చేరుకుంటాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి.<<-se>>#Karthikam<<>>