News December 12, 2024
క్లీంకార ఇప్పుడెలా ఉందో చూడండి!
రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార చూస్తుండగానే పెరిగిపోయింది. తన తాతతో క్లీంకార ఆలయాన్ని సందర్శించిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. ‘ఈరోజు మా హాస్పిటల్ టెంపుల్‌లోని వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన ముత్తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. తాత చేతుల్లో తనను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.
Similar News
News January 17, 2025
‘సంచార్ సాథీ’ యాప్ ప్రారంభం.. ఉపయోగాలివే
స్కామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు వీలుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ‘సంచార్ సాథీ’ యాప్‌ను ఆవిష్కరించారు. మీకు ఏవైనా అనుమానిత కాల్స్ వస్తే ఈ యాప్‌లో లాగినై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. మొబైల్ పోయినప్పుడు వెంటనే బ్లాక్ చేసే వీలుంది. మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకుని, అనధికార నంబర్లపై ఫిర్యాదు చేసే వీలుంది. IMEI నంబర్ ఎంటర్ చేసి మొబైల్ ప్రామాణికతను కూడా గుర్తించొచ్చు.
News January 17, 2025
మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు
HYD మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు దక్కింది. వీటిని న్యూయార్క్‌కు చెందిన వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్ ‘వరల్డ్ మోనుమెంట్స్ వాచ్-2025’ జాబితాలో చేర్చింది. హైకోర్టు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కాలేజ్, ఉమెన్స్ యూనివర్సిటీ వీటిలో ఉన్నాయి. కాగా కళ కోల్పోయిన ఈ చారిత్రక భవనాలకు సీఎం రేవంత్ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో పునర్వైభవం రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News January 17, 2025
పోలవరం ఆలస్యానికి జగనే కారణం: మంత్రి నిమ్మల
AP: గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తన కేసులు, బెయిల్ కోసం జలాలపై హక్కులను ఆయన వదులుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని రైతులు క్షమించబోరని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కూడా జగనే కారణమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు రెండు ఫేజ్‌లలో 51.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ ద్రోహం చేశారని మండిపడ్డారు.