News May 18, 2024

ఈజీగా PF బ్యాలెన్స్‌ చెక్ చేసుకోండి

image

ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను SMS లేదా మిస్డ్ కాల్ ద్వారానూ తెలుసుకోవచ్చు. ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపాలి. మిస్డ్ కాల్ ద్వారా అయితే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కి ఫోన్ చేయాలి. ఈ కాల్ రింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. కాసేపటి తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ ద్వారా వస్తాయి.

Similar News

News December 9, 2024

ఒక్క రోజు స్కూల్ స్కీమ్ @ Rs.17000

image

ఫారిన్ టూరిస్టులను ఆకర్షించేందుకు జపాన్ కంపెనీ ఉండోకైయా కొత్తగా ఆలోచించింది. జపనీస్ స్కూల్ లైఫ్‌ను ఆస్వాదించేందుకు ఒక రోజు స్టూడెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రూ.17వేలు చెల్లిస్తే చాలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేరొచ్చు. యూనిఫాంతో పాటు కటానా ఫైట్ నేర్చుకొనేందుకు కిమినోస్ డ్రెస్ ఇస్తారు. స్థానిక డాన్స్ నేర్పిస్తారు. యాక్టివిటీస్ చేయిస్తారు. క్లాసుల మధ్యలో భూకంపం వస్తే ఎలా బయటపడాలో బోధిస్తారు.

News December 9, 2024

ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్‌గా కొనసాగుతారు.

News December 9, 2024

మేం ఏమన్నా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?: మ‌మ‌త

image

భారత్‌లోని పలు రాష్ట్రాలను ఆక్ర‌మించుకుంటామ‌ని కొంద‌రు బంగ్లా రాజ‌కీయ నేతలు, మాజీ సైనికోద్యోగులు చేసిన వ్యాఖ్య‌ల‌కు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కౌంట‌ర్ ఇచ్చారు. ‘మీరు బెంగాల్‌, ఒడిశా, బిహార్‌ల‌ను ఆక్ర‌మించుకుంటుంటే మేము మాత్రం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?’ అంటూ కౌంట‌ర్ అటాక్ చేశారు. బంగ్లాలో హిందువులు హింస‌కు గుర‌వుతుండ‌డంపై బెంగాల్ హిందూ, ముస్లింలు ఆందోళ‌న‌గా ఉన్నార‌ని ఆమె పేర్కొన్నారు.