News August 9, 2024
ఆహార పదార్థాలు కొనేముందు ఇవి చూసుకోండి
దుస్తులు కొనేటప్పుడు MRPని చూసినట్లే ఆహార వస్తువులపై ఎక్స్‌పైరీ తేదీలను గమనించాలి. అయితే, వాటిపై మూడు తేదీలుంటాయి. తయారీ తేదీతో పాటు ‘బెస్ట్ బిఫోర్’, ‘యూజ్డ్ బై’ OR ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయి. ‘బెస్ట్ బిఫోర్’ అంటే ఆహారంలోని పోషకాలు, ఫ్రెష్‌నెస్ ఎన్నిరోజుల వరకు బాగుంటాయో తెలిపేది. ఆ డేట్ పూర్తయ్యాక కూడా తినొచ్చు. కానీ ఎక్స్‌పైరీ తేదీ దాటాక మరుసటి రోజు కూడా ఆ ఆహారాన్ని తినొద్దని FSSAI సూచిస్తోంది.
Similar News
News September 19, 2024
మద్యం షాపు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు
AP: నూతన మద్యం పాలసీలో భాగంగా 3,736 లిక్కర్ షాప్‌లలో 10 శాతం(340) గీత కార్మికులకు రిజర్వ్ చేస్తారు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు. లాటరీ విధానంలో రెండేళ్ల కాలపరిమితితో షాపులు కేటాయిస్తారు. ఉ.10 నుంచి రా.10 వరకు షాపులకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు రూ.50-85 లక్షలు చెల్లించాలి. 12 ప్రధాన పట్టణాల్లో 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా ఫీజు నిర్ణయిస్తారు.
News September 19, 2024
T20I నంబర్-1 ఆల్‌రౌండర్‌గా లివింగ్‌స్టోన్
ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. 124 రన్స్, 5 వికెట్లు తీయడంతో 253 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత స్టొయినిస్(211), సికందర్ రజా(208), షకిబ్ అల్ హసన్(206), నబీ(205), హార్దిక్ పాండ్య(199) ఉన్నారు. T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ట్రావిస్ హెడ్, బౌలింగ్‌లో అదిల్ రషీద్ టాప్‌లో ఉన్నారు.
News September 19, 2024
ఈ ఏడాది చివరిలోపు ఐపీఎల్ వేలం?
ఐపీఎల్-2025 కోసం చేపట్టే వేలం రానున్న నవంబరు ఆఖర్లో లేదా డిసెంబరు మొదటి వారంలో ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరో రెండ్రోజుల్లో అందుకు సంబంధించిన నిబంధనల్ని రూపొందించనున్నట్లు పేర్కొన్నాయి. గత రెండు ఆక్షన్లలాగే ఈసారి కూడా వేలం 2 రోజుల పాటు జరుగుతుందని సమాచారం. ఆటగాళ్ల కొనసాగింపు విషయంలో జట్ల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో నిబంధనలెలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.