News March 21, 2024

ఛీ.. ఛీ.. అసలు ఈమె తల్లేనా?

image

TS: మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ తల్లి 8 నెలల పసికందును చేనులో వదిలేసింది. నిన్న రాత్రి చేనులో వదిలేసి వెళ్లడంతో వీధి కుక్కలు ఆ పసిపాపపై దాడి చేసి, చంపేశాయి. శరీర భాగాలను పీక్కుతిన్నాయి. తల్లి గంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిని మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.

Similar News

News February 12, 2026

తేమ అవసరం.. అతి తేమతో పంటకు ప్రమాదం

image

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘త్రిపురారి’’

image

తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మ వరం పొంది బంగారం, వెండి, ఇనుముతో కూడిన 3 నగరాలను నిర్మించుకున్నారు. వారు లోకాలను హింసిస్తుండగా, దేవతల ప్రార్థన మన్నించిన శివుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. భూమినే రథంగా, వేదాలను గుర్రాలుగా చేసుకుని, ఒకే బాణంతో ఆ 3 పురాలను భస్మం చేసి రాక్షస సంహారం చేశాడు. ఆ 3 పురాలను(త్రిపుర) అంతం చేసిన శత్రువు(అరి) కాబట్టి ఆయన ‘త్రిపురారి’ అయ్యాడు.

News February 12, 2026

ఓల్డెస్ట్ క్రికెటర్.. స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ

image

శ్రీలంకతో <<19119596>>జరిగిన <<>>మ్యాచ్‌లో ఒమన్ క్రికెటర్ మహ్మద్ నదీమ్ చరిత్ర సృష్టించారు. T20WCలో హాఫ్ సెంచరీ చేసిన ఓల్డెస్ట్ ప్లేయర్‌(43Y 161D)గా నిలిచారు. 2009 ఎడిషన్‌లో సనత్ జయసూర్య 39Y 345D వయసులో అర్ధ శతకం చేశారు. మరోవైపు T20WC హిస్టరీలోనే స్లోయెస్ట్(52 B) హాఫ్ సెంచరీని కూడా నదీమ్ నమోదుచేశారు. 2024లో పాక్ ప్లేయర్ రిజ్వాన్ సైతం 52 బంతుల్లో అర్ధశతకం చేశారు.